ఏనుగుల సంరక్షణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా బందీగా ఉన్న ఏనుగులకు DNA గుర్తింపును తప్పనిసరి చేసింది. ప్రతి ఏనుగుకూ ఓ ప్రత్యేక వైద్య రికార్డు ఉండాలని, వాటికోసం ప్రత్యేక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. బందీ ఏనుగుల వివరాలు పక్కాగా నమోదు చేయాలని, వాటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపేలా మార్గదర్శకాలను జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
వార్తలు
ఏనుగుల DNA గుర్తింపు తప్పనిసరి: సుప్రీం


