హైదరాబాద్: 28°C
వార్తలు

VIDEO: ఆదోని సమస్యలపై ఎమ్మెల్యే గళం

KRNL: ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలను ప్రస్తావించారు. రాష్ట్రంలోని రెండు లక్షల దేవాలయాల్లో 27 వేల ఆలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయని తెలిపారు. దేవాలయాల భూములను పరిరక్షించాలని మంత్రిని కోరారు. ఉరుకుంద శ్రావణమాస ఉత్సవాలు, పెద్ద తుంబలం రామాలయం ప్రతిష్ఠ, ఆదోని రణమండల క్షేత్రాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.