హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రం నిబంధనలు.. 'X' కొత్త రూల్

భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహించే సోషల్ మీడియా సంస్థలు దేశ నిబంధనలను తప్పక పాటించాల్సిందేనని 'X'కు కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఇదిలా ఉండగా, ఎలాన్ మస్క్ ఓ కొత్త నిబంధనను తీసుకొచ్చారు. ఏదైనా ఒక అకౌంట్‌ను తొలగించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే, ఆ విషయాన్ని అందరికీ తెలిసేలా బహిర్గతం చేస్తామని 'X' సంస్థ స్పష్టం చేసింది.