హైదరాబాద్: 28°C
వార్తలు

అయోధ్య విరాళాల చోరీ కేసులో క్లీన్ చిట్

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో మాజీ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్ చిట్ ఇచ్చింది. ఆయనతో పాటు ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా ఈ కేసులో భారీ ఊరట లభించింది. ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరూ జూన్ 27న రాజీనామా చేశారు. తాజాగా సిట్ తన తుది నివేదికను తదుపరి చర్యల కోసం యూపీ హోంశాఖ ద్వారా రామజన్మభూమి ట్రస్ట్‌కు అందజేసింది.