హైదరాబాద్: 28°C
వార్తలు

'జై హింద్'.. నేతాజీకి సెల్యూట్!

భారత స్వాతంత్య్ర పోరాటంలో అలుపెరగని యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ వర్ధంతి నేడు. 1945 ఆగస్టు 18న తైవాన్‌లో జరిగిన విమాన ప్రమాదంలో ఆయన మరణించినట్లు భావిస్తారు. సాయుధ పోరాటంతోనే స్వేచ్ఛ సాధ్యమని నమ్మిన ఆయన 'జై హింద్' నినాదంతో యువతలో స్ఫూర్తి నింపారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆ మహనీయుడికి యావత్ భారతావని ఘనంగా నివాళులర్పిస్తోంది.