AP: కోనసీమ జిల్లాలో జాలర్లు గల్లంతైన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అల్లవరం మండలం ఓడలరేవు, దమ్మలపేట, వాసలతిప్పకు చెందిన జాలర్లు సముద్రంలో బోటుతో గల్లంతైన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం లేకుండా అన్ని చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు.
వార్తలు
కోనసీమ జాలర్ల గల్లంతుపై సీఎం సమీక్ష


