హైదరాబాద్: 28°C
వార్తలు

జూరాలకు స్వల్పంగా వరద ప్రవాహం

TG: జూరాల ప్రాజెక్ట్‌కు స్వల్పంగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్‌ఫ్లో 35,000, ఔట్‌ఫ్లో 41,934 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటిమట్టం 318.516 మీటర్లు కాగా ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం 318.230 మీటర్లకు చేరుకుంది. 10 యూనిట్లలో 434 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.