మధ్యప్రదేశ్‌లోని బింద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉపాధి కూలీలతో ప్రయాణిస్తున్న ఓ వాహనం అదుపుతప్పి ట్రక్కును బలంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ఎనిమిది మంది కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి


