ఎన్నికల్లో నల్లధనం ప్రభావం ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదమని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఎన్నికల సమయంలో పట్టుబడే అక్రమ నగదు, క్రిమినల్ కేసుల దర్యాప్తును అధికారులు ఏడాది లోపే పూర్తి చేయాలని కీలక మార్గదర్శకాలు ఇచ్చింది. గడువు దాటితే అందుకు గల కారణాలను ఎన్నికల సంఘానికి తెలపాలని స్పష్టం చేసింది. 2014 నాటి బళ్లారి నల్లధనం కేసు విచారణలో ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
నల్లధనం కేసులపై ఏడాదే గడువు: సుప్రీం


