ఏనుగుల స్వేచ్ఛా సంచారానికి అడ్డుకట్ట వేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహించింది. పంటల రక్షణ సాకుతో ఏనుగుల కారిడార్లలో ఎలాంటి అడ్డంకులు, నిర్మాణాలు చేపట్టరాదని రాష్ట్రాలను హెచ్చరించింది. ఇటువంటి చర్యలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఏనుగుల రాకపోకలకు ఆటంకాలు ఎక్కడైనా ఉన్నాయా? అనే దానిపై దేశవ్యాప్త సర్వే చేసి, సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖను ఆదేశించింది.
వార్తలు
‘పంటల రక్షణ పేరిట ఏనుగులకు అడ్డొద్దు’


