హైదరాబాద్: 28°C
వార్తలు

బీసీ రిజర్వేషన్లపై రేపు కేబినెట్‌లో కీలక చర్చ!

AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల హామీ నేపథ్యంలో రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. బీసీల సామాజిక, ఆర్థిక పరిస్థితులు, వివిధ రంగాల్లో ప్రాతినిధ్యంపై రూపొందించిన ఈ నివేదికపై రేపు జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మంత్రివర్గ ఆమోదం తర్వాత అసెంబ్లీలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.