TG: HYD సనత్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. పేదలకు కార్పొరేట్ వైద్యం ఉచితంగా అందించడమే లక్ష్యమన్నారు. 32 నెలల పాలనలో వైద్య రంగానికి రూ.21,800 కోట్లకు పైగా కేటాయించామని, ఆరోగ్యశ్రీ, CMRF ద్వారా రూ.5,226 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఈ సందర్భంగా గత పాలకుల తీరుపై CM తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
వార్తలు
పేదలకు కార్పొరేట్ వైద్యం లక్ష్యం: రేవంత్


