హైదరాబాద్: 28°C
వార్తలు

ఒకే వేదిక.. త్వరలో ‘మీటికెట్’ యాప్

TG: ప్రజారవాణా సేవలను ఒకే గొడుగు కిందకు తెచ్చేందుకు TGS RTC మీసేవ ఆధ్వర్యంలో 'మీటికెట్' మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా బస్సులు, మెట్రో, ఆటోలు, క్యాబ్‌లను ఒకే వేదికపై బుక్ చేసుకోవచ్చు. ఆర్టీసీ సొంతంగా ఆటోలు కొనుగోలు చేస్తుందంటూ వస్తున్న ప్రచారంలో నిజం లేదని యాజమాన్యం స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాలను నమ్మి అపోహలకు గురికావద్దని విజ్ఞప్తి చేసింది.