హైదరాబాద్: 28°C
వార్తలు

ఎమ్మెల్యేగా ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం

బీహార్ బంకీపూర్ ఎమ్మెల్యేగా జన్ సూరాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ రాష్ట్ర శాసనసభలో స్పీకర్ ప్రేమ్ కుమార్ ప్రశాంత్ కిషోర్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాజీనామాతో బంకీపూర్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ కంచుకోటను బద్దలుకొడుతూ ప్రశాంత్ కిషోర్ 19,324 ఓట్ల తేడాతో గెలుపొందారు.