హైదరాబాద్: 28°C
వార్తలు

కేంద్రానికి సుప్రీం సూటి ప్రశ్న

కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూటి ప్రశ్నలు వేసింది. అణు విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం జరిగి ప్రజలకు నష్టం జరిగితే.. పరిహారం ఇప్పించే అధికారం కోర్టులకు ఉంటుందా? లేదా కొత్త అణు చట్టంలోని పరిమితులే వర్తిస్తాయా? అని నిలదీసింది. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించి అణు విద్యుత్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకే ఈ పరిమితిని విధించారా అని ప్రశ్నించింది.