హైదరాబాద్: 28°C
వార్తలు

మోదీతో మరోసారి ఫడ్నవీస్ భేటీ

ప్రధాని మోదీతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ మరోసారి సమావేశమయ్యారు. దీంతో ఫడ్నవీస్‌కు కేంద్ర విద్యాశాఖ బాధ్యతలు అప్పగించవచ్చని కథనాలు మరోసారి ఊపందుకున్నాయి. అయితే కేంద్ర కేబినెట్‌లోకి వెళ్లే అంశంపై సీఎం గతంలోనే క్లారిటీ ఇచ్చేశారు. అవన్నీ ఊహాగానాలేనని కొట్టిపారేశారు. తనను మహారాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారని.. రాష్ట్ర బాధ్యతలు నెరవేర్చడమే తన ప్రాధాన్యత అని తెలిపారు.