హైదరాబాద్: 28°C
వార్తలు

రూల్స్‌ పాటించని విమానాలు నిలిపివేయండి: సుప్రీం

విమాన ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రద్దీగా ఉండే సమయాల్లో విమాన ఛార్జీలు అడ్డూ అదుపు లేకుండా పెంచడాన్ని తప్పుపట్టింది. ఈ సందర్భంగా ఛార్జీల విషయంలో ప్రభుత్వ ఆదేశాలను పాటించని విమానయాన సంస్థల సేవలను నిలిపివేయాలని తెలిపింది. అలాగే భారతీయ వాయుయాన్ అధినియం చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2వారాల్లో సీల్డ్ కవర్‌లో సమర్పించాలని కేంద్రానికి సూచించింది.