కేంద్రమంత్రి అమిత్ షా సంచలన ప్రకటన చేశారు. ISI మద్దతు కలిగిన షహజాద్ భట్టీ నెట్‌వర్క్ అనే ఉగ్రవాద గ్రూప్‌ను నాశనం చేసినట్లు వెల్లడించారు. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందే ఆ గ్రూపునకు చెందిన 200 మందికిపైగా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈ చర్యలతో దాని విధ్వంసకర దాడుల ప్రణాళికలను భగ్నం చేశామన్నారు. ఉగ్రవాదం విషయంలో భారత్ కఠిన వైఖరికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు.
వార్తలు
అమిత్ షా సంచలన ప్రకటన


