మధ్యప్రదేశ్ ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్సవాలలో ఏర్పాటు చేసిన బారికేడ్లకు విద్యుత్ సరఫరా అవుతోందని చేసిన తప్పుడు ప్రచారంతో ఒక్కసారిగా ప్రజలు అక్కడి నుంచి పరుగులు తీయడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
వార్తలు
ఉజ్జయిని ఆలయంలో తొక్కిసలాట


