కావేరి జలాల పంపిణీ వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ షాక్ తగిలింది. తమిళనాడుకు తక్షణమే కావేరి జలాలను విడుదల చేయాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. కావేరి అథారిటీ ఇచ్చిన ఆదేశాలను కర్ణాటక సర్కార్ తప్పక పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు రానున్న 12 రోజుల పాటు ప్రతిరోజూ 12 వేల క్యూసెక్కుల నీటిని తమిళనాడుకు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
వార్తలు
సుప్రీంకోర్టులో కర్ణాటక ప్రభుత్వానికి షాక్


