హైదరాబాద్: 28°C
వార్తలు

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల సాయం

బీహార్‌లోని ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై ఆ రాష్ట్ర సీఎం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన ఆవేదన చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేయడంతో పాటు, ఒక్కో కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.