బీహార్‌లోని అశోక్‌ధామ్ ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన పట్ల ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రధాని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. బాధితులకు తగిన సాయం అందిస్తామన్నారు.
వార్తలు
బీహార్ ఘటనపై మోదీ దిగ్భ్రాంతి


