హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుత్తి సమీపంలో బొలెరో బోల్తా

ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో సోమవారం సిమెంట్ ఫినిషింగ్ స్తంభాలతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స కోసం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు.