హైదరాబాద్: 28°C
వ్యాపారం

దేశీయంగా ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ ఫోన్ల తయారీ

చైనా బ్రాండ్లు ఒప్పో, వన్‌ప్లస్, రియల్‌మీ స్మార్ట్‌ఫోన్ల తయారీ ఇకపై దేశీయంగా భారీ స్థాయిలో జరగనుంది. ప్రముఖ సంస్థ 'అంబర్ ఎంటర్‌ప్రైజెస్' ఒప్పో ఇండియాతో దీనికోసం ఒప్పందం కుదుర్చుకుంది. 2027 మార్చి త్రైమాసికం నుంచి మొబైల్స్ ఉత్పత్తిని ప్రారంభించనుంది. తొలి ఏడాది ఏకంగా 80 లక్షల ఫోన్లను తయారు చేయాలనుకుంటున్నట్లు అంబర్ సీఈఓ జస్బీర్ సింగ్ తెలిపారు.