హైదరాబాద్: 28°C
వ్యాపారం

పరిమిత శ్రేణిలోనే స్టాక్ మార్కెట్లు!

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం పరిమిత శ్రేణిలో కదలాడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమాసియా పరిస్థితులు, చమురు సరఫరా ఆందోళనలు మార్కెట్లపై ప్రభావం చూపనున్నాయి. అయినప్పటికీ కార్పొరేట్ ఫలితాలు మెరుగ్గా ఉండటం, ఈనెలలో విదేశీ మదుపరులు పెట్టుబడి(రూ.16,621 కోట్లు) సానుకూల అంశాలు. సాంకేతికంగా నిఫ్టీ-50 సూచీకి 22,000-24,000 వద్ద మద్దతు, 24,500 వద్ద నిరోధం కనిపిస్తోంది.