హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 30 నుంచి తిరుమలలో యాగం

TPT: రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురవాలని శ్రీవారిని ప్రార్థిస్తూ ఈ నెల 30 నుంచి SEP 3వ తేదీ వరకు కారీరిష్టి యాగం, వరుణజపం, పర్జన్యశాంతి హోమాలను టీటీడీ నిర్వహించనుంది. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 32 మంది వేద, శ్రౌత, స్మార్తపండితులు యాగ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 3న మహాపూర్ణాహుతి నిర్వహిస్తారు.