హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రీన్‌ఫీల్డ్ హైవే వద్ద చిరుత సంచారం?

ప్రకాశం: C.S.పురం మండలంలోని పెద గోగులపల్లి సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో చిరుతపులి సంచరిస్తుండగా స్థానికులు గుర్తించినట్లు సమాచారం. గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో చిరుతపులి కనిపించిందనే విషయం తెలుసుకున్న స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చిరుతపులి సంచారంపై వాస్తవాలు తెలియాలని, అటవీ అధికారులు ఈ ఘటనపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.