హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిర్చియార్డు విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

GNTR: రైతులు దళారుల బారిన పడకుండా పంటలకు మెరుగైన మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు గుంటూరు మిర్చియార్డు విస్తరణకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. 108 ఎకరాల్లో విస్తరణ చేపట్టి ప్రాసెసింగ్, డ్రయర్లు, స్టెరిలైజేషన్, ప్యాకింగ్, నాణ్యత పరీక్షా ప్రయోగశాల ఏర్పాటు చేయనున్నారు. మిర్చితో పాటు కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలకు మార్కెటింగ్ వసతులు కల్పించనున్నారు.