హైదరాబాద్: 28°C
వార్తలు

'రైతులకు సర్కార్ మొండి చేయి చూపుతోంది'

TG: రుణమాఫీ, రైతు భరోసాలోనూ కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. రైతులకు ప్రభుత్వం మొండి చేయి చూపుతోందన్నారు. రైతు బీమా పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయాలని కోరారు. రైతు డిక్లరేషన్ హామీలను ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు.