PPM: కురుపాం మండలం గొటివాడ పరిధిలోని బోరి, బండిగూడ గ్రామాల ప్రజలకు వర్షాకాలం వచ్చిందంటే కష్టాలు తప్పడం లేదు. వాగులు ఉప్పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ముఖ్యంగా విద్యార్థులు ప్రాణాలకు తెగించి వాగులు దాటుకుంటూ పాఠశాలలకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ఏళ్లుగా వంతెన నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నప్పటికీ హామీలు కార్యరూపం దాల్చడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
వంతెన లేక ప్రాణాలకు తెగించి ప్రయాణం


