PPM: కొమరాడ మండలం కొమరాడ గ్రామంలోని మరడనా వీధిలో మోటార్ పాడవ్వడంతో నీరు లేక రెండు రోజులుగా ఇక్కట్లు పడుతున్నట్లు కాలనీ వాసులు వాపోతున్నారు. వీధి కాలవలో దోమలు ఎక్కువ అవ్వడంతో ఊర్లో ఉన్న కాలవలో బ్లీచింగ్ చల్లాలని గ్రామస్థులు కోరుతున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్
నీరు లేక కొమరాడలో కాలనీ వాసుల అవస్థలు


