హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంట పొలాల్లోకి దూసుకెళ్లిన కారు.. తప్పిన ప్రమాదం

KKD: కరప మండలం వేములవాడ వద్ద సోమవారం పెను ప్రమాదం తప్పింది. మండపేట నుంచి కాకినాడ వెళ్తున్న కారు అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదు. కారులో ఉన్న మహిళకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న కరప పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.