హైదరాబాద్: 28°C
వార్తలు

‘NTA తప్పు చేస్తే విద్యార్థులకు శిక్షా?’

యూజీసీ-నెట్(సోషియాలజీ, ఇంగ్లీష్, కామర్స్) పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) రద్దు చేయడంపై LoP రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పాత ప్రశ్నలు ఇవ్వడం వల్లే రెండు నెలల తర్వాత పరీక్షలు రద్దు చేశారని ధ్వజమెత్తారు. NTA తప్పు చేస్తే విద్యార్థులకు శిక్ష ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏళ్ల తరబడి కష్టపడి పరీక్ష రాసిన వారు మళ్లీ సెప్టెంబర్‌లో రాయాల్సి రావడం దారుణమన్నారు.