హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేటి నుంచి వైద్య సేవలు బంద్

నెల్లూరు: స్టైపెండ్‌ను సవరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లు నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను కూడా నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రభుత్వం నుంచి లిఖితపూర్వక హామీ రాకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జూ.డాక్టర్స్ అసోసియేషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు హనీశ్ తెలిపారు.