హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సరీని ధ్వంసం చేసిన దుండగులు

PLD: వినుకొండ (M) చీకటిగలపాలెం సమీపంలోని జనిత్ సిటీ సమీపంలోని నర్సరీపై రాత్రి దుండగులు దాడికి పాల్పడ్డారు. నర్సరీకి నిప్పంటించడంతో పాటు పైపులు, నెట్లను కత్తిరించి,మొక్కలపై గడ్డి మందు చల్లారు. మిరప, పొగాకు, జామాయిల్ నార్లు దెబ్బతిన్నాయి. 50 మందికి పైగా రైతులు నష్టపోయారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు రైతులు తెలిపారు.