హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పదేళ్లుగా మరమ్మతులకు నోచుకోని రోడ్డు..!

GNTR: తెనాలి–చండూరు ప్రధాన రహదారిలో పెదరావూరు నుంచి కూచిపూడి వరకు నాలుగు కిలోమీటర్ల మేర రహదారి గుంతలమయంగా మారింది. 2016లో ప్రారంభమైన పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో పదేళ్లుగా మరమ్మతులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ గుంతల కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయి. త్వరలో కొత్త గుత్తేదారుతో పనులు ప్రారంభించి రహదారిని పూర్తిచేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు తెలిపారు.