హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కుటుంబ కలహాలతో మహిళ ఆత్మహత్య..!

KRNL: ఎమ్మిగనూరు టౌన్ మిలిటరీ కాలనీలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. బోయ నాగలక్ష్మి (46) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు, కోడలితో తరచూ.. గొడవలు జరిగేవని స్థానికులు తెలిపారు. ఇటీవల కోడలు ఇంటి నుంచి వెళ్లిపోవడంతో తీవ్రంగా కలత చెందిన ఆమె ఇంట్లో ఉరివేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.