హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బీసీ హాస్టళ్ల సమస్యలపై ఎమ్మెల్యే ప్రస్తావన

సత్యసాయి: జిల్లాలో బీసీ సంక్షేమ హాస్టళ్ల సమస్యలపై సోమవారం అసెంబ్లీలో పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరరెడ్డి మాట్లాడారు. జిల్లాలోని 60 హాస్టళ్లకు కేవలం 26 మంది వార్డెన్లు మాత్రమే ఉన్నారని, 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. కుకు, వాచ్‌మెన్ పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయని పేర్కొంటూ తక్షణమే వాటిని భర్తీ చేయాలని కోరారు.