VSP: విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో సివిల్ విమాన సర్వీసులు ముగియడంతో హౌస్కీపింగ్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికురాలు సునీత మాట్లాడుతూ.. తమకు ఎలాంటి డబ్బులు, ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదని వాపోయారు. 15 రోజుల జీతం కూడా చెల్లించలేదన్నారు. కుటుంబాలు గడవడం కష్టంగా మారిందని, తిండి, నీరు, వసతి లేక దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నామని కన్నీటిపర్యంతమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
'ఉద్యోగం పోయింది.. జీతం రాలేదు'


