కృష్ణా: గుడివాడ(M) వలివర్తిపాడులో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వృద్ధురాలు సాలి నాంచారమ్మ ఇంట్లో నిద్రిస్తుండగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు గమనించి ఆమెను కాపాడారు. అగ్నిమాపక శాఖకు తెలపడంతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసినట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
షార్ట్ సర్క్యూట్.. ఇల్లు దగ్ధం..!


