హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతలమయంగా ప్రధాన రహదారి..!

KRNL: కోసిగి-మంత్రాలయానికి వెళ్లే మార్గంలోని దొడ్డి, డి.బెళగల్ గ్రామాల వద్ద ప్రధాన రహదారి గుంతలమయమై అద్వానంగా మారింది. గత కొన్ని నెలలుగా రోడ్డు దుస్థితి అధ్వానంగా ఉండటంతో వాహనదారులు, రైతులు, ప్రయాణికులు తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తక్షణమే రహదారికి మరమ్మతులు చేపట్టి గుంతలను పూడ్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.