హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లాలో 4.84 కోట్ల ఉచిత ప్రయాణాలు'

నెల్లూరు: స్త్రీశక్తి పథకానికి మహిళల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఆధార్ కార్డు చూపించి జీరో టికెట్‌తో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు 15న పథకం ప్రారంభమైన తొలి రోజే నెల్లూరు జిల్లాలో 3,555 మంది మహిళలు ప్రయాణించారు. ఇప్పటివరకు జిల్లాలోని 7 RTC డిపోల పరిధిలో 4,84,87,519 మంది ఉచిత ప్రయాణం చేశారని అధికారులు తెలిపారు.