హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గుంతల రహదారిపై ప్రమాదాల ముప్పు

VZM: మెంటాడ మండలం కొంపంగి జక్కువ గ్రామాల మధ్య రహదారి అధ్వానంగా మారింది. రోడ్డంతా గుంతలు ఏర్పడటంతో పాటు పలుచోట్ల ఎత్తుపల్లాలు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దూరం నుంచి గుంతలు, ఎత్తుపల్లాలు కనిపించకపోవడంతో సమీపానికి వచ్చిన తర్వాత వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోతున్నారు.