BPT: చీరాల బోస్‌నగర్‌లోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం వద్ద డ్రైనేజీ లేక భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య స్పందించారు. ఆయన ఇచ్చిన హామీ మేరకు ఆలయం వద్ద డ్రైనేజీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయించారు. సమస్యను త్వరితగతిన పరిష్కరించినందుకు గాను ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి, పూలమాలలు వేసి తమ కృతజ్ఞతలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజ్ ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు


