అన్నమయ్య: మదనపల్లె మండలం దొనబైలు గ్రామ విద్యార్థులు బడికి వెళ్లేందుకు రోజూ 8 కిలోమీటర్లు అడవి మార్గంలో నడుస్తున్నారు. రోడ్డు అధ్వానంగా ఉండటంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. విద్యార్థులతో పాటు రైతులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 4 కిలోమీటర్ల మేర పక్కా రోడ్డు నిర్మించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
చదువు కోసం భారమైన నడక.. చర్యలు ఏవి..?


