హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

అన్నమయ: సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సూచించారు. అపరిచితుల ఫోన్ కాల్స్‌ను నమ్మి ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వెల్లడించవద్దన్నారు. జిల్లా వ్యాప్తంగా పోలీసులు ప్రజలకు సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్, ఆన్‌లైన్ బెట్టింగ్, ట్రేడింగ్, ఏటీఎం మోసాలపై అవగాహన కల్పించారు.