హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

ప్రకాశం: పామూరు(M)వగ్గంపల్లి గ్రామ సమీపంలో రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఆదివారం రాత్రి కారు ఢీకొట్టగా మృతి చెందాడు. మృతుడు పామూరు(M) వగ్గంపల్లి గ్రామానికి చెందిన పుల్లారెడ్డిగా పోలీసులు గుర్తించారు. గాయపడ్డ సమయంలో పుల్లారెడ్డిని స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు ఆపకుండా వెళ్ళిపోయింది.