బీహార్ రాష్ట్రం లఖిసరాయ్ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ప్రముఖ అశోక్‌ధామ్ ఆలయంలో ఊహించని విధంగా ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘోర ప్రమాదంలో ఏడుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
వార్తలు
ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి


