హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల్ బ్యాడ్మింటన్‌లో విజయవాడ జట్ల విజయం

కృష్ణా: గన్నవరం బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరిగిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పురుషులు, మహిళల విభాగాల్లో విజయవాడ జట్లు విజేతలుగా నిలిచాయి. మచిలీపట్నం జట్లు ద్వితీయ స్థానం సాధించాయి. జిల్లా నలుమూలల నుంచి క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారని, గన్నవరం కేంద్రంగా క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నామని నిర్వాహకులు తెలిపారు.