హైదరాబాద్: 28°C
వార్తలు

అల్పపీడ‌నం.. ప‌లు జిల్లాల్లో వ‌ర్షాలు

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఉత్తరాంధ్ర తీరప్రాంతాల్లో మంగళవారం వరకు గంటకు 40-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, ఏలూరు, NLR, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.